Oops! This site has expired. If you are the site owner, please renew your premium subscription or contact support.

APWJF
Andhra Pradesh Working Journalists Fedaration

తెలుగులో టైపు చెయ్యడం ఎలా?

అంతర్జాలంలో తెలుగు టైపు చేయటం ఇప్పుడు చాలా సులువు.  అందుకు చాలా పరికరాలు, పద్ధతులు అందుబాటులోఉన్నాయి. వాటన్నింటి ఏర్చి, కూర్చి ఒకే చోట అందించే ప్రయత్నమే ఇది.

ఆన్ లైన్ టైపింగ్ ప్యాడ్ (జాల సాధనాలు) మీ కంప్యూటర్లో స్థాపించుకోనవసరం (ఇన్ స్టాల్) లేదు, అంతర్జాల సంధానం ఉండాలి, టైపు చేసిన దాన్ని కాపీ-పేస్టు చేసుకోవాలి.ఇవి మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తూ పోతూ ఉంటే, తెలుగు లోకి మారుస్తాయి. అంటే, "telugu" అని టైపు చేసి స్పేస్ కొట్టగానే "తెలుగు" గా మారుస్తాయి.

      •ఇండిక్ ఇన్‌పుట్ పొడగింత

      • పద్మ పొడగింత 

      •తెలుగు టూల్‌బార్  

      • ప్రముఖ్ టైప్

సిస్టంలో తెలుగు ఎనేబుల్ చేసినా కూడా వార్తాపత్రికలు చదవాలంటే కష్టమే. దీనికి కారణం యూనికోడ్ లో మనమందరం వాడేది గౌతమి ఫాంట్. పేపర్ల ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ని కాపీ చేసుకుని My computer>C > Windows > Fonts లో పేస్ట్ చేయండి. భారతీయ భాషల లోని వార్తా పత్రికలను చదవడానికి  http://uni.medhas.org/

కంప్యూటర్లో ఎక్కడైనా తెలుగు టైపు చెయ్యడానికి (నేరుగా టైపు చేసుకోవచ్చు. కాపీ-పేస్టు అవసరం లేదు. అంతర్జాల సంధానం అవసరం లేదు.):

జీ మెయిల్ లో తెలుగు


తెలుగు టైపు చేయడానికి తెలుగు టైపింగ్ నేర్చుకునే అవసరం లేకుండా జిమెయిల్ Indic Transliteration feature సహాయం తో తెలుగు ని సునాయాసంగా టైపు చేయవచ్చును. టైపు చేసిన వ్యాఖ్యాలను జిమెయిల్ నుండి కాపి చేసి ఆన్ లైన్ తెలుగు ఫోరమ్స్ లో పోస్ట్ చేయవచ్చును.

Image

జీమెయిల్ లో మీరు మాములుగా మెయిల్ కంపోజ్ చేసే టెక్స్ట్ ఎడిటింగ్ బాక్స్ ఎడమ కార్నర్ పైన వున్న చిన్న నల్ల త్రికోణం మీద క్లిక్ చేస్తే లాంగ్వేజ్ ఆప్సన్స్ డ్రాప్ అవుతాయి. ( చిత్రం లో చూడండి) డ్రాప్ ఐన ఆప్షన్స్ నుండి తెలుగు ఆప్సన్ని సెలెక్ట్ చేసుకుని తెలుగు పదాలనే ఇంగ్లీష్ లో టైపు చేసి కీ బోర్డ్ మీద స్పేస్ బార్ నొక్కగానే ఇంగ్లీష్ పదాలు తెలుగులోనికి మారుతాయి.

ఉదాహరణ కు "telugu"అని ఇంగ్లీష్ లో టైపు చేసి కీ బోర్డ్ మీద స్పేస్ బార్ నొక్కితే "telugu" అనే పదం "తెలుగు" గా మారుతుంది.మధ్య మధ్య లో ఇంగ్లీష్ పదాలను టైపు చేయాలంటే పైన కార్నర్ మీద వున్న "అ" ఐకాన్ ని మీద క్లిక్ చేసి, డిస్ఎబిల్ ఐనాక మామూలుగా ఇంగ్లీష్ టైపు చేసు
కోవచ్చును.

ఇదే పద్దతిలో అన్ని భారతీయ భాషలను టైపు చేయవచ్చును.

జీమెయిల్ లో కాకుండా వేరే బ్రౌజరు లో transliterate ని ఓపెన్ చేసి తెలుగు లో టైప్ చేయడానికి దయచేసి ఈ దిగువ తెలియజేసిన లింకు మీద క్లిక్ చేయండి. transliterate ని డౌన్లోడ్ చేసుకుని offline లో మీ లోకల్ కంప్యూటర్ లో తెలుగు టైప్ చేసుకునే సౌలభ్యం ఉంది.


http://www.google.com/transliterate/Telugu

విండోస్‌లో తెలుగు చదవడం

 1. మీ సిస్టం లో Desktop మీద right click చేసి
 2. Settings ఎంచుకుని
 3. Appearence లో effects క్లిక్ చేసి
 4. "Use the following method to smooth edges of screen fonts" అన్నదాన్ని "ClearType" కి మార్చండి.
 5. అన్నీ Ok కొట్టేస్తే తేడా మీకే తెలుస్తుంది.

ఇక XP‌లో తెలుగు చదవడానికి, స్టోర్‌ చేయడానికి ఈ క్రింది రెండు పద్దతుల్లో మీకు సరిపోయేది ఎంచుకుని చేసేయ్యండి. ఒక పద్దతిలో XP ది ఎదో ఒక CD ఉండాలి. ఇంకోదాంట్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. మొదటిది CD ఉన్న వాళ్ళకి. ఒకవేళ CD లేదు, ఇంటర్నెట్ సదుపాయం ఉంది అంటే ఇక్కడ నొక్కండి. రెండూ లేకపోతే, ఇక్కడ నొక్కండి.

CD ఉన్న వాళ్ళైతే

 • నియంత్రణ ఫ్యానల్ లో తేదీ, సమయం, భాష మరియు ప్రాంతీయ ఎంపికలు లో ప్రాతీయం, భాష ఎంపికలు (Control Panel లో Date, Time Language and Regional Settings లో Regional and Language settings) కి వెళ్ళండి.
 • ఆ తెరుచుకున్న విండోలో, క్రింద బొమ్మలో చూపించినట్టు భాషలు(Languages) అనే ట్యాబ్ మీద నొక్కండి.
 • క్కడ పైన చూపిన విధంగా టిక్కు పెట్టని రెండు బాక్సులుంటాయి. వాటిని టిక్ చేసేసి OK కొట్టేయండి. CD పెట్టమని అడుగుతుంది, పెట్టేసి OK అని కొట్టేయండి.
 • అంతా అయిపోయాక CD తీసేసి కంప్యూటర్ని రీబూట్ చేయండి.
 • ఏదైన తెలుగు వెబ్‌సైట్‌ కి వెళ్ళి చూడండి. మీరు ఇక మీ కంప్యూటర్లో తెలుగు నిక్షేపంగా చదువుకోవచ్చు, స్టోర్‌ చేస్కోవచ్చు.

ఒక్క మాట! Notepad లో సేవ్‌ చేసేటప్పుడు, ఎన్‌కోడింగ్‌(encoding) UTF-8 ఉండేలా చూస్కోండి. లేకపోతే మీరు సేవ్‌ చేసింది మళ్ళీ తెరిచి చూస్తే అది సరిగ్గా చూపించదు.

ఒకవేళ CD లేకపోతే, ఇంటర్నెట్ సదుపాయం ఉంటే

 1. లంకె నొక్కి పోతన, వేమన ఫోంట్లు దించుకోండి.
 2. దించుకున్నాక, దాన్ని unzip చేస్తే వచ్చే Pothana2000.ttf మరియు vemana.ttf లను C:\Windows\Fonts లోకి copy చేయండి.
 3. ఏదైన తెలుగు వెబ్‌సైట్‌ కి వెళ్ళి తెలుగు చదవడం మొదలెట్టండి.

రెండూ లేకపోతే

ఒకవేళ ఇంటర్నెట్ సదుపాయం కూడా లేకపోతే, వేరే ఏదైనా ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్లో పైన(ఇక్కడ) చెప్పిన ఫోంట్లు దించుకుని, పెన్‌ డ్రైవ్‌ లో కాపీ చేస్కుని, దాంట్లోనుంచి మీ కంప్యూటర్కి కాపీ చేసి, ఇక రెండో Step లో చెప్పినట్టు చేసేయ్యండి.  పై రెండు మార్గాలకి తేడ ఏంటంటే, మొదటి పద్దతిలో మీరు తెలుగుతో పాటు ఇలాంటి ఎన్నో భాషలు కూడా చదువగలుగుతారు, రెండవదాంట్లో ఒక్క తెలుగు మాత్రమే చదువగలుగుతారు.

 

ఇక ఆలస్యం దేనికీ?..ఇకపై మీ పోస్టులు తెలుగు లోనే టైపు చేయండి.