Oops! This site has expired. If you are the site owner, please renew your premium subscription or contact support.

APWJF
Andhra Pradesh Working Journalists Fedaration

సమాచార హక్కు చట్టం - 2005

ప్రపంచంలో భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.భారత రాజ్యాంగంలో గణతంత్రప్రజాస్వామ్యానికి పెద్దపీట వేశారు. ప్రజాస్వామ్యం సవ్యంగా పనిచేయాలన్నా, అవినీతిని అరికట్టాలన్నా,ప్రభుత్వాలు,వాటి శాఖలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సమాచారంలో పారదర్షకత తో పాటు దేశ పౌరులందరికి విషయ పరిగ్నానం ఉన్నప్పడే ఇది సాద్యపడుతుంది. దురదుష్టవశాత్తూ అవినీతిలో భారత్ నేడు ప్రపంచంలో ముందు వరసలో ఉంది. దేశాభివృద్దికి ప్రధాన అవరోదంగా తయారయింది.అన్ని ప్రభుత్వ శాఖల్లో, అన్ని స్థాయుల్లోను చేయు తడపనిదే పని జరగటం లేదన్నది జగమెరిగిన సత్యం. వనరుల వినియోగంలో సమతుల్యం లోపించడం వల్ల పేద,దనిక వర్గాల మద్య అంతరం పెరిగింది. అభివృద్ది పలాలు ప్రాదాన్యత క్రమంలో దక్కకపోవడంతో పేధల అబ్యున్నతికి ఎన్ని పంచవర్ష ప్రణాళికలు వచ్చినా పలితం శూన్యం. ప్రజల్లొ ప్రశ్నించే హక్కు కొరవడం మూలానే "సమాచారం" చీకట్లో మగ్గి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. మేదావులు, స్వచ్చంద సంస్థలు, ఉద్యమకారుల పోరాట పలితంగా ప్రజాస్వామ్య ఆశయానికి ప్రాధాన్యతనిస్తూ పారదర్షకత కల్గిన సమాచారాన్ని పౌరులకు అందించటానికి వెలుగు సూచిన చట్టమే "సమాచార హక్కు చట్టం-2005"

సమాచారమంటే ఏమిటి? దీని పరిదిలోకి ఏ సమాచారం వస్తుంది?

సమాచారహక్కు చట్టం ప్రకారం "సమాచారం" అనగా రికార్డులు,పత్రాలు, మెమోలు,ఇ-మెయిల్స్, అభిప్రాయాలు, ఒప్పందాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, లాగ్బూక్స్,కాంట్రాక్టులు,నివేదికలు, పేపర్లు, శాంపిళ్ళు, మోడల్స్, డేటాసహా ఎలక్ట్రానిక్ రూపంలో నున్న సమాచారం (ప్లాపీ, సేడీ, డీవీడీ, మెమోరిచిప్, ప్రింట్,క్యాసెట్) మొదలగునవి.

సమాచారహక్కు చట్టం అంటే ఏమిటి? ఈ హక్కు ద్వారా ఏం చేయవచ్చు?

 సమాచారహక్కు చట్టం సెక్షన్-2 సబ్ సెక్షన్-జె ప్రకారం ఏ అధికారి నియంత్రణ క్రింద ఉన్న సమాచారాన్నయినా ఈ చట్టం క్రింద పొందగలిగే హక్కుతో పాటు, పనులను, పత్రాలను, రికార్దులను తనిఖేచేసేహక్కు , రికార్దులలో నున్న సమాచారాన్ని ఎత్తి రాసుకోవటం, వాటినకలు, సర్టిపైడ్ కాపేలు తీసుకోవటం, సమాచార సంపత్తి సర్టిపైడ్ శాంపిళ్ళు,తీసుకోవటం, డిస్కులు, ప్లాపీలు,టేపులు, వీడియోటేపులు,క్యాసెట్లరూపంలో, మరే విదమైన ఎలక్త్రానిక్ రూపంలోనున్న సమాచారాన్ని పొందటం, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలలో నిక్షిప్తమైఉన్న సమాచారాన్ని ప్రింట్ అవుట్ల ద్వారా పొందటం ఈ హక్కులో భాగం.

సమాచారం పొందటం ఎలా? ఎవరికి ధరఖాస్తు చేయాలి? ఎంత మొత్తం చెల్లించాలి?

సమాచారహక్కుచట్టం,2005 సెక్షన్-6, సబ్ సెక్షన్-1 ప్రకారం సమాచారాన్ని పొందగోరువారు ఇంగ్లీష్, హిందీ,లేదా అదికార భాషలో రాతపూర్వ కంగా, ఎలక్ట్రానిక్ రూపంలో తమ అభ్యర్దనను ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజాసమాచార అధికారి కి పోస్టులో , నేరుగా అందించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ర్త్రప్రభుత్వాలు ఇప్పటికే అన్ని కార్యాలయాల్లోవి వీరిని నియమించాయి. ఇదే సెక్షన్ లోని సబ్ సెక్షన్-2 ప్రకారం దరఖాస్తులో ఎటువంటి వ్యక్తిగత వివరాలు సమర్పించాల్సిన పనిలేదు. వయస్సు, స్థానికతతో నిమిత్తంలేదు. తిరుగుటపాకు అవసరమైన చిరునామా ఇస్తే సరిపోతుంది. కోరినభాషలో సమాచారం పొందేహక్కు సెక్షన్4(4) కల్పించింది. సమాచారం పొందటానికి విన్నపానికితోడు దరఖాస్తు రుసుము చెల్లించటానికి రాష్ట్ర ప్రధాన పరిపాలన శాఖ (ఐ-పిఆర్) జి.ఓ.యం.ఎస్.నెం: 454 తేది:13-10-2005 ద్వారా మార్గదర్శకాలను సూచించింది. దీనిప్రకారం గ్రామస్థాయిలో ఎలాంటి రుసుం చెల్లించాల్సిన పనిలేదు. మండలస్థాయిలో దరఖాస్తు ఒక్కంటికి రూ:5, ఆపై స్థాయిలో రూ:10 చెల్లించాలి. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు సంబందిత దృవపత్రం జతపరిస్తే ఎలాంటి రుసుం చెల్లించ నక్కరలేదు. నగదు, డిమాండు డ్రాప్టు, బ్యాంకర్స్ చెక్ ద్వారా దరఖాస్తురుసుం చెల్లించి రసేదు పొందాలి. ఇంతకంటే సులువుగా కోర్టుఫీ స్టాంపును, పోస్టల్ ఆర్డర్ ను దరఖాస్తుపై అంటించే పద్దతిని జి.ఓ.ఎం.ఎస్.నెం.740 తేది:01-10-2007 ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ కల్పించింది. వీటితోపాటు సమాచారాన్ని సమకూర్చి నందుకు సంబందితశాఖలు ఈ రేట్లను వసూలు చేస్తున్నాయ్. 1) ముద్రించిన ,టెక్స్ట్ రూపంలో నున్న ఎ4,ఎ3 సైజు పేపరు ప్రతికాపీకి ఒక్కొపేజీకి రూ-2,అంతకుమించిన సైజులు, మ్యాపులు, ప్లానులకు వాటివాస్తవదర. బి) ఎలక్రానిక్ నమూనాలోనున్న ప్లాపీకి రూ-50, 700ఎంబి సిడికి రూ-100,డివిడికి రూ-200/- చి) రికార్డుల తనిఖీకి మొదటిగంటకు రుసుంలేదు. ఆతర్వాత ప్రతిపావు గంటకు రూ-5/- డి) షాంపుల్శ్, మోడల్స్ కు దాని వాస్తవధర ఉంటుంది. ఇ) ఫొస్టు ద్వారా పంపిస్తే తపాలా చార్జీలు. పిర్యాదుదారే భరించాలి.  

అప్పీలు ఎవరికి చేయాలి? ఎలా చేయాలి? ఏ పత్రాలు జతచేయాలి?

సమాచార హక్కు చట్టం సెక్షన్-7 లోని సబ్ సెక్షన్-1 ప్రకారం అభ్యర్ధన అందిన 30 రోజుల్లొ పీఐఓ లు సంబందిత సమాచారం అందించాలి.అలా కానీ పక్షంలో ఈ చట్టంలోని సెక్షన్-19, సబ్ సెక్షన్-1 క్రింద కాలపరిమితి ముగిసిన తర్వాత 30 రోజుల్లోగా మొదటి అప్పీలును ఆపై అధికారికి, జిల్లాఅధికారికి అప్పీలు చేసుకోవచ్చు. తగిన కారణాలు ఉన్నట్లయుతే గడువు ముగిసినా ఆ అప్పీలును స్వేకరించవచ్చు. మొదటి అప్పీలును 30 రోజుల్లో పరిష్క రించాలి. రెండవసారి అప్పీలు చేయదలిస్తే మొదటి అప్పీలు నిర్ణయం వెలువడిన తర్వాత 90 రోజులవరకు ఎప్పుడైనా సమాచార కమీషన్లకు రెండవ అప్పీలు చేసుకోవచ్చు. అప్పీలు అందిన 30 రోజుల్లొ పరిష్కరించటం,అవసరమనిపిస్తే మరో 15 రోజులు కాలపరిమితిని పెంచి ఆ అప్పీలును పరిష్కరించటం సమాచార కమీషన్ల విది. మొదటి,రెండవ అప్పీలు చేసుకోవటానికి అభ్యర్ధనలో క్రింది సమాచారం పేర్కొనాలి. అ) అప్పీలు దాఖలు చేసే వ్యక్తిపేరు, చిరునామా. బి) ఎవరి నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలును దాఖలు చేయడం జరిగిందో, అందుకు సంబందించి నెంబరుతోసహా ఉత్తర్వు వివరాలు, సి) అప్పీలును ధాఖలు చేయబడినట్టి అంశానికి సంబందించి నెంబరుతో సహా ఉత్తర్వు వివరాలు, డి)అప్పీలు చేయడానికి దారి తీసిన సంగ్రహ వాస్తవాలు. ఇ) దరఖాస్తు నిరాకరణకు వ్యతిరేకంగా అప్పీలును డాఖలు చేసినట్లయుతే దరఖాస్తును ఇచ్చినట్టి (పీఐఎ) పేరు, చిరునామా, సంఖ్య, తేదీ తోపాటు దరఖాస్తు వివరాలు.ఎఫ్) కోరిన అభ్యర్ధన లేదా సహాయం. జి) అభ్యర్ధన లేదాసహాయం కోసం గల కారణాలు. హెచ్) అప్పీలు దాఖలు చేసిన వ్యక్తి పరిశీలన ఐ) కమీషన్,అప్పీలును పరిష్కరించటానికి అవసరమని భావించదగు ఏదేని ఇతర సమాచారం. దస్తావేజుల సూచిక.  

సమాచారం ఇవ్వని అదికారులకు శిక్షలున్నాయా?

ప్రజలిచ్చిన అబ్యర్ధనలను పి.ఐ.ఓలు, అప్పిలేట్ అదికారులు సరైన కారణం లేకుండా దరఖాస్తును తీసుకోవటానికి నిరాకరించటం, సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం సకాలంలో సమాచారం అందించక పోవటం,తెలిసీ తప్పుడు సమాచారం అందించడం, సమాచారం ఇవ్వకుండా అడ్డుపడటం, కోరిన సమాచారాన్ని ద్వంసం చేయడం వంటి సందర్బాలలో సమాచార కమీషన్ విచారణలో పై విషయాలు స్పష్టమైతే సమాచార మందించేవరకు లేదా దరఖాస్తు స్వేకరించేంతవరకు రోజుకు రూ.250 చొప్పున 25వేలు మించకుండా జరిమానా విదించవచ్చు. జరిమానాతోపాటు ప్రబుత్వోద్యోగుల సర్వీసు నిబందనల క్రింద పి.ఐ.ఓలు, అప్పిలేట్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా సిపార్సు చేసే అధికారం సమాచార కమీషన్లకుంది.  

రాష్ట్ర పరిధిలో సమాచారహక్కు చట్టం వర్తించని సంస్థలున్నాయా? ఆయా సంస్థల నుంచి సమాచారం పొందటం ఎలా?

సమాచారహక్కు చట్టం సెక్షన్-24,సబ్ సెక్షన్(4)ప్రకారం రాష్ట్రప్రభుత్వం నెలకొల్పిన ఇంటెలిజెన్స్,భద్రతాసంస్థలకు ఈ చట్టం వర్తించదు. రాష్ట్రప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్. నెం.667,తేది:03-09-2007 ద్వారా ఈ చట్టం నుంచి మిన హాయింపు పొందిన సంస్థలను గెజిట్లో ప్రచురించింది.దీని ప్రకారం 1) స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్టుమెంట్,స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్,స్టేట్ సెక్యూరిటివింగ్ 2) స్టేట్ గ్రేహ్యాండ్స్ ఆర్గనైజేషన్ 3) అన్ని జిల్లల ఎస్పీల పరిది లోని స్పెషల్ బ్రాంచ్ లు, 4) అన్ని జిల్లల ఎస్పీల పరిదిలోని సెక్యూరిటి యూనిట్లు, 5) ఎపీఎస్పి, 6) ఎస్పీఎఫ్ 7) స్టేట్ ఆర్ముడ్ రిజర్వ్ సెంట్రల్ పోలీస్ లైన్ మొదలగు సంస్థలు సమాచారహక్కు చట్టం 2005 నుంచి మినహాయింపు పొంది ఉన్నాయి. ఈ సంస్థలు ప్రబుత్వానికి సమర్పించే ఎలాంటి సమాచారానికి ఈ చట్టం వర్తించదు. అవినీతి ఆరోపణలకు సంబందించిన సమాచారం అయినప్పుడు ఈ సెక్షన్ నుంచ్ మినహాయింపు ఉంటుంది.మానవ హక్కుల ఉల్లంఘణకు సంబందించిన సమాచారం అయితే రాష్ట్ర సమాచార కమీషన్ ఆమోదం పొందిన తర్వాత 45 రోజులలోగా సంబందిత సంస్థ ఈ సమాచారం అందించాల్సి ఉంటుంది. 

సమాచార హక్కు చట్టం అమలులో అధికార యంత్రాంగాల పాత్ర

సమాచారాన్ని పొందటం కొరకు ప్రజలు వీలైనంత తక్కువగా ఈ చట్టాన్ని ఆశ్రయించేలా చూడటానికి ప్రజలు కోరకుండానే వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ప్రసారసాధనాలు, ఇతర మార్గాల ద్వారా అధికార యంత్రాంగాలు ప్రజలకు అందించాలని ఈ చట్టం స్పష్టం చేస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తేది నుంచి 120 రోజులలోపు ప్రతి అదికారయంత్రాంగం సమాచారహక్కు సమర్ధంగా అమలయేందుకు తమ దగ్గరున్న అన్ని రికార్డులు, పట్టికలు, పద సూచికలు సక్రమంగా నిర్వహించటం, వీటన్నింటినీ క్రోడీకరించి కంప్యూటర్ లో నిక్షిప్తం చేయడం, సమాచారం అందుభాటులో ఉండేదుకు ఇంటర్నెట్ లో ఉంచటం, వంటి పనులు చేయడం ప్రభుత్వ శాఖల విధి. ఈ చట్టం ప్రకారం ఈ క్రింది అంశాలను విదిగా పేర్కొనాల్సి ఉంది. 1) ప్రతి అధికార యంత్రాంగానికి సంబందించిన వివరాలు, విదులు,ఆ శాఖ అధికారులు, ఉద్యోగులకున్న అధికారాలు. 2) పర్యవేక్షణ, జవాబుదారీ తనానికి సంబంధించిన మార్గాలతో పాటు ,నిర్ణయ పక్రియలో అనుసరించే విధానాలు, కార్యనిర్వాహణలో పాటించే సూత్రాలు. 3) ఆ శాఖ ఉద్యోగులు పాటించే నియమ నిబందనలు,ఆదేశాలు, మాన్యువళ్ళు,రికార్డులు. 4) ఆశాఖ దగ్గర ఉన్న పత్రాల రకాలకు సంబదించిన ప్రకటన. 5) ఆ శాఖ విదానాల రూపకల్పన కోసం, ప్రజల భాగస్వామ్యం స్వీకరించేందుకు ఉన్న పద్దతులు. 6) ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు పొందే నెలవారీ వేతనం,పరిహారం చెల్లింపు వివరాలు, సమాచార సంపుటి. 7) అన్ని ప్రణాళికలు, ప్రతిపాదిత వ్యయాలు,జరిపిన చెల్లింపుల వివరాలు. 8) సబ్సిడి పథకాల అమలుతీరు, వాటికి కేటాయించిన నిదులు, ఆ పథకాల లబ్దిదారుల వివరాలు. 9) ఆ శాఖ మంజూరు చేసే రాయితీలు, పర్మిట్లు,అనుమతులు పొందుతున్న వారి వివరాలు. 10) ఆ శాఖ పరిదిలోని బోర్డులు, ఏజన్సీలు, కమిటీలు, సంస్థలకు చెందిన సమస్థ వివరాలు. 11)ప్రతి శాఖ తన పరిది లోని కార్యాలయాలలో గల పౌర సమాచార అధికారుల పేర్లు,హోదాలు,ఇతర వివరాలు ప్రజలకు తెలిసేట్లు ఉంచాలి. 12) ప్రతి యేడాది అప్ డేట్ చేస్తూ తాజా సమాచారాన్ని ప్రకటించడం. ఇవేగాక ముఖ్యమైన విధానాల రూపకల్పన, ప్రజలపై ప్రభావం చూపే నిర్ణయాలను ప్రకటించేటప్పుడు వాటికి సంబందించిన వాస్తవాలను ప్రచురించాలి. ప్రజల అభ్యర్ధనతో నిమిత్తం లేకుండా పై సమాచారాన్ని అన్ని ప్రభుత్వ శాఖలు ప్రజల ముందుంచాల్సిన భాద్యత ఉంది.

సమాచార హక్కు చట్టం ఆచరణలో విపలం కావటానికి కారణాలు

సమాచార హక్కు చట్టం ఆచరణలో విపలం కావటానికి కారణాలు :- 1) ఈ చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించకపోవటం,ఈ చట్టం అమలులోకి వచ్చి ఆరేళ్ళయినా సరైన ప్రచారం కల్పించక పోవడం, 2) పి.ఐ.ఎ, ఏపీ.ఐ.ఎ లకు శిక్షణ నిప్పించక పోవటం, 3) సమాచార కమీషన్ కు నిదులలేమి, సిబ్బంది లేకపోవటం. కమీషనర్ల ను నియమించకపోవటం 4) అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తుగా తమ విభాగానికి సంబందించిన సమాచారాన్ని ప్రజల ముందు ఉంచక పోవటం 5) ప్రభుత్వ ఆపీసుల్లో పూర్థి స్తాయులో కంప్యూటరీకరణ జరగక పోవటం,చాలా శాఖలు తెలుగు సాప్ట్ వేరును సమకూర్చుకోకపోవటం, 6) తక్షణమే పరిష్కరించ దగిన అభ్యర్దన లను నెలరోజుల దాకా తమ దగ్గర పెండింగులో ఉంచుకోవటం.7) సమాచారాన్ని ఇవ్వని అదికారులకు జరిమానాలు, శిక్షలు లేకపోవటం 8) అత్యదికులు నిరక్షరాస్యు లైనందున దరఖాస్తు చేసుకొనే విధానం తెలియక పోవటం 9) దరఖాస్తు రుసుము చెల్లింపులో స్పష్టమైన విధానం పాటించక పోవటం, 10) సిటిజన్ చార్టర్ ను ప్రబుత్వ విభాగాలు సరిగా అమలు చేయక పోవటం,11)వ్యవస్థలో పేరుకు పోయున అవినీతి, లంచగొండితనం ఈ చట్టం అమలుకు ప్రతిబందకాలుగా తయారయ్యాయి. అర్ద శతాబ్దిగా అలవాటుపడిన విధానం నుంచి ప్రభుత్వ యంత్రాంగం బయటపడలేకపోతుంది.  ప్రజల్లో చైతన్యం వస్తే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.  

 సమాచారం ఇవ్వని అదికారులకు శిక్షలున్నాయా?

ప్రజలిచ్చిన అబ్యర్ధనలను పి.ఐ.ఓలు, అప్పిలేట్ అదికారులు సరైన కారణం లేకుండా దరఖాస్తును తీసుకోవటానికి నిరాకరించటం, సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం సకాలంలో సమాచారం అందించక పోవటం,తెలిసీ తప్పుడు సమాచారం అందించడం, సమాచారం ఇవ్వకుండా అడ్డుపడటం, కోరిన సమాచారాన్ని ద్వంసం చేయడం వంటి సందర్బాలలో సమాచార కమీషన్ విచారణలో పై విషయాలు స్పష్టమైతే సమాచార మందించేవరకు లేదా దరఖాస్తు స్వేకరించేంతవరకు రోజుకు రూ.250 చొప్పున 25వేలు మించకుండా జరిమానా విదించవచ్చు. జరిమానాతోపాటు ప్రబుత్వోద్యోగుల సర్వీసు నిబందనల క్రింద పి.ఐ.ఓలు, అప్పిలేట్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా సిపార్సు చేసే అధికారం సమాచార కమీషన్లకుంది.  

రాష్ట్ర పరిధిలో సమాచారహక్కు చట్టం వర్తించని సంస్థలున్నాయా? ఆయా సంస్థల నుంచి సమాచారం పొందటం ఎలా?

సమాచారహక్కు చట్టం సెక్షన్-24,సబ్ సెక్షన్(4)ప్రకారం రాష్ట్రప్రభుత్వంనెలకొల్పిన ఇంటెలిజెన్స్,భద్రతాసంస్థరభుత్వం లకు ఈ చట్టం వర్తించదు. జి.ఓ.ఎం.ఎస్. నెం.667,తేది:03-09-2007 ద్వారా ఈ చట్టం నుంచి మిన హాయింపు పొందిన సంస్థలను గెజిట్లో ప్రచురించింది.దీని ప్రకారం 1) స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్టుమెంట్,స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్,స్టేట్ సెక్యూరిటివింగ్ 2) స్టేట్ గ్రేహ్యాండ్స్ ఆర్గనైజేషన్ 3) అన్ని జిల్లల ఎస్పీల పరిది లోని స్పెషల్ బ్రాంచ్ లు, 4) అన్ని జిల్లల ఎస్పీల పరిదిలోని సెక్యూరిటి యూనిట్లు, 5) ఎపీఎస్పి, 6) ఎస్పీఎఫ్ 7) స్టేట్ ఆర్ముడ్ రిజర్వ్ సెంట్రల్ పోలీస్ లైన్ మొదలగు సంస్థలు సమాచారహక్కు చట్టం 2005 నుంచి మినహాయింపు పొంది ఉన్నాయి. ఈ సంస్థలు ప్రబుత్వానికి సమర్పించే ఎలాంటి సమాచారానికి ఈ చట్టం వర్తించదు. అవినీతి ఆరోపణలకు సంబందించిన సమాచారం అయినప్పుడు ఈ సెక్షన్ నుంచ్ మినహాయింపు ఉంటుంది.మానవ హక్కుల ఉల్లంఘణకు సంబందించిన సమాచారం అయితే రాష్ట్ర సమాచార కమీషన్ ఆమోదం పొందిన తర్వాత 45 రోజులలోగా సంబందిత సంస్థ ఈ సమాచారం అందించాల్సి ఉంటుంది. 