Oops! This site has expired. If you are the site owner, please renew your premium subscription or contact support.

APWJF
Andhra Pradesh Working Journalists Fedaration

                                 తూర్పుగోధావరి జిల్లా APWJF తృతియ మహాసభ విశేషాలు

                             

                   వృత్తి విలువల పరిరక్షణకు పాటుపడాలి - తూర్పుగోదావరి మహాసభలో  

                                    సమాచార శాఖ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి పిలుపు 

జర్నలిస్టులు వృత్తిపరమైన విలువలను కాపాడుతూ , రాష్ట్ర ప్రగతికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వామ్యం వహించాలని రాష్ట్ర, సమాచార పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (ఎపిడబ్ల్యుజె ఎఫ్ )తూర్పుగోదావరి జిల్లా తృతియ మహాసభ జూన్ 27  న కాకినాడలోని అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర, సమాచార పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి , ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్, రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి పి.విశ్వరూప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  కార్యక్రమంలో మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని, ముఖ్యమంత్రి రోశయ్య మీడియా పట్ల సదా మైత్రీభావం పాటిస్తారని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఇటీవలే యాబై లక్షల నుంచి కోటి రూపాయలకు  పెంచిందని, 24 లక్షల మొత్తాన్ని పెన్షన్ గా ఇచ్చామని ఆమె తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని జర్నలిస్టులకు వర్తింపజేసే ఆరోగ్య కార్డులు పంపిణీ చేశామని, ప్రస్తుతం జరుగుతున్న రేషన్ కార్డుల సర్వే పూర్తయిన వెంటనే మిగిలిన జర్నలిస్టులందరికీ ఆరోగ్య కార్డులు ఇస్తామన్నారు. మెడిక్లెయిమ్ పథకం క్రింద జర్నలిస్టుల భీమా ప్రీమియంలో 64 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించి ఆరోగ్య భద్రత కల్పిస్తుందన్నారు. ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులను అందిస్తూ వృత్తిపరమన ప్రోత్సాహాన్ని అందిస్తోదన్నారు. జర్నలిస్టుల వృత్తిలో విలువలు ముఖ్యమని, నేడు మీడియా రంగంలో చోటుచేసుకుంటున్న అనైతిక ధోరణులను జర్నలిస్టులు వ్యతిరేకించాలని కోరారు.ఎన్నో సామాజిక రుగ్మతలు యిప్పటికీ కొనసాగుతున్నాయని వీటిని రూపుమాపేందుకు జర్నలిస్టులు నడుం బిగించాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధులుగా నిలుస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడు ప్రాధాన్యత నిస్తుందని అన్నారు.

                          

రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ తిరుమలగిరి సురేంధర్ మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు విసృతంగా శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.జర్నలిజం వృత్తిలో పని చేస్తున్న వారికి డిప్లొమా కోర్సులు నిర్వహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తు న్నామని అన్నారు. రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామన్నారు. జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎం.రవిచంద్ర మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోరుతూ జర్నలిస్టులు ఇచ్చే సూచనలు, సలహాలను సదా స్వాగతిస్తున్నామన్నారు. జిల్లా పోలీస్ సూపరిం టెండెంట్ జి.శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్, మీడియా సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించ వచ్చన్నారు. కార్యక్రమానికి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కె.సత్యనారాయణ అద్యక్షత వహించారు. శాసనసభ్యులు కె.కన్నబాబు, ఎమ్మెల్సీ నిమ్మకాయల చిన్నరాజప్ప, జెడ్పీ చైర్మన్ వేణుగోపాల కృష్ణ , ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎస్.హష్మీ, జి.ఆంజనేయులు, కార్యదర్శి కె.మంజరి, గౌరవాద్యక్షులు టి. మధుసూదన రావు లు ప్రసంగించారు.కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి వి.నవీన్ రాజు స్వాగతం పలికారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఆర్ధిక సహకారం అందించిన రెడ్డి జ్యోతికుమార్, సోము ప్రసాద్, బాదం బాలకృష్ణ లకు కార్యక్రమంలో సత్కారం చేశారు.