Oops! This site has expired. If you are the site owner, please renew your premium subscription or contact support.

APWJF
Andhra Pradesh Working Journalists Fedaration

                                              'సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం'  హెచ్‌యుజె మహాసభ లో వక్తల ప్రశంస

                      

    సమాజంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారని, జర్నలిజం వృత్తి పవిత్రమైందని, సమాజంలో జరిగే మంచి చెడులను తమ వార్తల ద్వారా ప్రతిఫలిస్తు, ప్రజలను జాగృతం చేయటంలో పత్రికా రంగం గురుతర బాధ్యత నిర్వహిస్తోందని ప్రముఖులు పేర్కొన్నారు. త్యాగరాయ గానసభలో 6 ఆగస్టు 2011( శనివారం )నాడు హైదరాబాద్‌ జర్నలిస్టుల యూనియన్‌ ( హెచ్‌యుజె ) మహాసభ జరిగింది. ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ తిరుమలగిరి సురేందర్‌ మాట్లాడుతూ ప్రెస్‌ అకాడమీలో హెచ్‌యుజె ప్రాతినిధ్యం కల్పించే అంశం ప్రభుత్వానికి పంపామన్నారు. విలేకర్లలో తానూ ఒకడిగా సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీనిచ్చారు. పాత్రికేయుల సమస్యలు తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తానన్నారు. వారిలో తానూ భాగస్వామున్నేనన్నారు. పార్లమెంటు సభ్యులు అంజన్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ అవాస్తవమైన, నిరాధారమైన వార్తల శీర్షికలకు ప్రశ్నార్థకం పెట్టి ప్రచురించడంపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్యాకేజీలతో పెయిడ్‌ ఆర్టికల్స్‌ ప్రచురణపై ధ్వజమెత్తారు. ఇటువంటి పనులు జర్నలిస్టుల విలువలను దిగజారుస్తాయని అన్నారు. జర్నలిస్టులకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. తన కొడుకు భూ కబ్జాకు పాల్పడినట్లు ప్రశ్నార్థకం పెట్టి వార్త రాయడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందనగా కార్యవర్గ సభ్యులు అమరయ్య మాట్లాడుతూ పెయిడ్‌ ఆర్టికల్స్‌ వివాదస్పద అంశం ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పరిశీలనలో ఉందన్నారు.      

                       

 ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ఉపాధ్యక్షులు ఎమ్‌.కోటేశ్వరరావు మాట్లాడుతూ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరూ వర్కింగ్‌ జర్నలిస్టులు కాదన్నారు. పత్రిక పక్షాన ప్రతినిధులుగా వెళ్లేవారిని జర్నలిస్టులుగా సమాజం భావిస్తోందని, కానీ అందులో వాస్తవం లేదని ఆయన వివరించారు. పెద్ద పత్రికలుసైతం బినామీ ఏజెన్సీలను ఏర్పరచుకొని విలేకరులు ఇచ్చే వార్తలకు ఆయా ఏజెన్సీల పేరిట ప్రచురిస్తోందని, యాజ మాన్యాన్ని ప్రభుత్వ అధికారులు ప్రశ్నించడం లేదని ఆవేదన వ్యక్తం చేవారు. వేతన కమిటీ సిఫారుసుల ప్రకారం వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేయడంపై యూనియన్‌ పోరాటం చేస్తుందన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా రిపోర్టర్లు వర్కింగ్‌ జర్నలిస్టులుగా గుర్తింపులేదన్నారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ హెచ్‌కె.నాగు మాట్లాడుతూ త్రైపాక్షిక సంఘం ఏర్పాటుకు వివిధ యూనియన్లు ఒక్కరినే తమ ప్రతినిధిగా ప్రతిపాదిస్తూ కమిషన్‌కు పంపితే త్వరితగతిన సంఘం ఏర్పాటు జరుగుతుందన్నారు. ఇఎస్‌ఐ, పెన్షన్‌ స్కీం, వేతన సంఘం సిఫారసులు వంటి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. శాసనసభ్యులు జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అవినీతి అంశంపై అన్నా హజారేకు అండగా నిలిచిన మీడియా సమాజంలో అతి పవిత్రమైందని, రాజకీయపార్టీలకు దిశానిర్దేశనం చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు చట్టసభలో లేవనెత్తని సమస్యలను ఎత్తిచూపుతూ రాజకీయ నాయకుల్ని బోనులో నిలబెడుతుందన్నారు. వేదికపై మంజరి, ఎపిడబ్ల్యుజెఎఫ్‌ అధ్యక్షులు ఎమ్‌ఎస్‌ హష్మి, కన్వీనర్‌ కె.వేణుగోపాల్‌ తదితరులు మాట్లాడారు. హెచ్‌యుజె అధ్యక్షులు ఎమ్‌.సోమయ్య స్వాగతం పలికిన సభలో కార్యదర్శి పి.ఆనందం నివేదిక సమర్పించారు.